వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్నదాతలను మోసం చేస్తూ పెద్ద మొత్తంలో నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు సుమారు 34 లక్షల రూపాయల విలువగల వివిధ కంపెనీల పేర్ల కలిగి వున్న నకిలీ పురుగు మందులతో పాటు, రెండు కార్లు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ పురుగు మందు లేబుల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ రెండు రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు అనుమానస్పదంగా ఒక కారు తనీఖీ చేయగా అకారులో పురుగు మందల డబ్బాలను గుర్తించి పోలీసులు కారులో వున్న నిందితుల్లో ఒకడైనకాట్రగౌడ భాస్కర్ రెడ్డి అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించడంతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ నిమిత్తంగా నిన్నటి రోజున నిందితుడు కాట్రగౌడ భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్లోని చర్లపల్లి ప్రాంతంలోని నిందితుల గోడౌన్ దాడి చేసి మిగితా నలుగురు నిందితులతో పాటు బెయర్, టాటా, కోర్టెవాతో మరో నాలుగు కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు, గడ్డి మందులను స్వాధీనం చేసుకోని నిందితులను విచారించగా పురుగు మందులకు అవసరమైన ముడి సరుకులను కోనుగోలు చేసిన వాటి ద్వారా డిమాండ్ వున్న కంపెనీ పేర్లతో నకిలీ పురుగు ఇగడ్డి మందులను తయారీ చేసి రైతులను మోసం చేసున్నట్లుగా నిందితులను అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేసి నకిలీ పురుగు,గడ్డి మందులు, లెబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
RELATED ARTICLES