సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ శివారు లో ద్విచక్ర వాహనము అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి చెందాడు వివరాల్లోకి వెళితే బొంత చంద్రయ్య S/o సాయిలు వయస్సు 62 సంవత్సరాలు కులం వడ్డెర గ్రామం కొంకపాక పర్వతగిరి మండలం అతని ఫిర్యాదు ఏమనగా ఫిర్యాది పెద్ద కొడుకు అయినా బొంత దేవేందర్ వయస్సు 40 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తనకు పండినటువంటి వడ్లు ఐకెపి సెంటర్లో కాంటా పెట్టి వాటికి సంబంధించిన ట్రక్ షీట్లను తీసుకొని తేదీ 02.05.2024 న ఉదయం 11:30 గంటలకు గురువారం రోజు నక్కల పెళ్ళిలోని మహాలక్ష్మి రైస్ మిల్ కు తన యొక్క మోటార్ సైకిల్ హీరో స్ప్లెండర్ ప్లస్ పై బయలుదేరి వెళ్ళినాడు కానీ సాయంత్రం వరకు కూడా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఫిర్యాది అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అవడంతో పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు అయినది అనంతరం ఫిర్యాది నక్కలపల్లి మహాలక్ష్మి రైస్ మిల్ వద్దకు వచ్చి తెలుసుకొనగా తన కొడుకు అక్కడకు రాలేదని వారు చెప్పడంతో అనంతరం ఫిర్యాది తన కొడుకు గురించి వెతుకుతూ సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ శివారులో చల్లగొండ దేవేంద్రరావు మరియు చల్లగొండ శాంతారావు రోడ్డు పక్కన గల పుత్తులో బావిలో మోటార్ సైకిల్ తో సహా ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్లుగా సమాచారం తెలిసినదని తెలుపగా శుక్రవారం రోజు సంగెం ఎస్ఐ ఎల్, నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బావిలో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చారుకి కి తరలించి కేసు నమోదు చేయనైనది అని తెలిపారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి మోటార్ సైకిల్ వాహనదారుడు మృతి
RELATED ARTICLES