తేజ న్యూస్ టివి, సంగెం
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి
సోమవారం సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట 2025 కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలలో ఎంతో ఉన్నతమైన విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు.ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల సర్వే నిర్వహించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, రాగి జావా, యూనిఫార్మ్స్ అందించటం జరుగుతుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారనే మంచి నాణ్యమైన విద్యా అందుతుందన్నారు. ప్రతీ ఒక్కరు తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే స్వచ్ఛమైన విద్య
RELATED ARTICLES