Saturday, January 18, 2025

ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల మరియు స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణీ.. :ఎంపీపీ కందకట్ల కళావతి*

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో సంగెం మండలం ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే గవిచర్ల మోడల్స్ స్కూల్ లో పాఠ్యపుస్తకాల పంపిణీ మరియు ఏక రూప దుస్తువులు పాఠశాల ప్రారంభం రోజే అందించాలి అనే దృఢసంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన కార్యక్రమంలో భాగంగా బుధవారం   రోజు మోడల్ స్కూల్ ,జడ్.పి.హెచ్.ఎస్  పాఠశాలలో హెచ్ఎం  విక్రమ్ కుమార్ , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రెహ్మాన్ అధ్యక్షతన ఏర్పాటుచేసినారు,  కార్యక్రమనికి ముఖ్య అతిథి గా సంగెం మండల ఎంపీపీ కందకట్ల కళావతి హాజరై మాట్లాడుతూపిల్లలకు పాఠ్యపుస్తకాలు మరియు స్కూలు యూనిఫార్మ్స్  పాఠశాల ప్రారంభోత్సవం రోజే పంపిణీ చేయటం  చాలా ఆనందంగా ఉందని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  మరియు పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి  సంగెం మండలంలోని అన్ని పాఠశాలలకు మౌఖిక వసతులకు గాను సుమారు 1 కోటి 50 లక్షల నిధులను మంజూరీ చేయించినారు. అట్టి పనులను అమ్మ ఆదర్ష్ పాఠశాల కమిటీల ద్వారా పనులను వేగంగా పూర్తి చేయించటం జరుగుతున్నది అని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంనిర్దేశించిన గడువుకు ముందే స్కూల్ యూనిఫార్మ్స్ స్టిచ్చింగ్ చేసి అందించిన స్వయం సహాయక బృందాల మహిళలను మరియు సెర్ప్, డీఆర్డీఏ సిబ్బందిని అభినందించారు.పడవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాదించినందుకు ఉపాద్యాయులను అభినందించి, పాఠశాల టాపర్ గా నిలిచిన విద్యార్థిని నిరాటి నక్షేత్రను శాలువాతో సన్మానించారు.  ఈ కార్యక్రమంలో గవిచర్ల ఎంపీటీసీ గూడ సంపత్ రెడ్డి ,సంగెం ఎంపీటీసీ మెట్టిపల్లిమల్లయ్య మాజీ సర్పంచ్ కందకట్ల నరహరి అచ్చ నాగరాజు ఏపిఎం కిషన్ ఏఏపిసి చైర్ పర్సన్ సంగెంప్రవళిక ,మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల చైర్మెన్ రాధిక్ ,ఎంపీపీ ఎస్ హెడ్మాస్టర్ కుమారస్వామి మరియు రెండు పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular