TEJA NEWS TV
ఎటురునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కొత్త ప్రిన్సిపల్ గా కామర్స్ విభాగం నుండి డాక్టర్ రేణుక నియమితులయ్యారు. కాలేజీ ఏట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారు జారీ చేసిన ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించినట్టుగా ఆమె వెల్లడించారు. ఈ నేపద్యంలో కొత్తగా నియమితులైన ప్రధానఆచార్యులకు తోటి కళాశాల అధ్యాపకులు శాలువా కప్పి పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు.
ఈ మేరకు డాక్టర్ రేణుక( ప్రధాన ఆచార్యులు ) మాట్లాడుతూ ప్రిన్సిపాల్ అంటే అదొక అత్యున్నత మైన బాధ్యత అని, అటువంటి బాధ్యతను స్వీకరించిన నేను విద్యార్థినీ విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దడంలో ప్రధమ భూమిక పోషిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, సిహెచ్ వెంకటయ్య, కవీస్ ఫాతిమా, డాక్టర్ జ్యోతి, సంపత్, మున్ని, వంశీ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కొత్త ప్రిన్సిపల్ నియామకం
RELATED ARTICLES