తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలకేంద్రంలోని
వివిధ డిపార్ట్ మెంట్ లలో పట్టుదల.. ప్రణాళిక..ఉద్యోగంలో విజయం.ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి మార్గం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అభినందనలు చేయడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు సాధించిన వారు రావుల క్రాంతి కానిస్టేబుల్, చెదులూరి పరిమళ జూనియర్ లెక్చరర్, నంగునూరి మానస టీచర్, గూడెల్లి నవ్య స్టాప్ నర్స్ గా వివిధ శాఖల ఉద్యోగులుగా ఎంపికయ్యారు వీరికి శాలువాలతో ఘనంగా సన్మానం అభినందనం చేయడం జరిగింది. వీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి,సమాజానికి ఆదర్శంగా నిలవాలని పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని సమాజాన్ని చైతన్యపరచాలని సూచించడం జరిగింది, మీరు భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఎర్ర విజయ్ కుమార్, మార్గం సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ సురేశ్, సింగారపు బాబు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాంకాల యాదగిరి, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, కరుణ శ్రీ, కిషన్ కుమార్, చిర్ర రాజ్ కుమార్, మొగిలి, చిర్ర ప్రశాంత్, విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి ఘనంగా సన్మానాలు అభినందన
RELATED ARTICLES