Sunday, March 23, 2025

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ…లక్షల్లో డబ్బు, బంగారం స్వాహా చేసిన నిందితుడి అరెస్టు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, అలాగే నిట్‌ లాంటి కళాశాలలో సీటు ఇప్పిస్తున్నాను అంటూ బాధితుల నుండి లక్షల్లో డబ్బుతో పాటు బంగారు ఆభరణాలను స్వాహా చేసిన మోసగాడిని హన్మకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు సుమారు ఐదు లక్షల పదివేల రూపాయల విలువ గల  గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 2లక్షల 68 వేల రూపాయల నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లను, IDFC డెబిట్ కార్డు ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి హన్మకొండ ఏసిపి దేవేందర్‌ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కడప జిల్లా, వీరపునాయునిపల్లి మండలం, ఇందుకూరు కొత్తపల్లి గ్రామానికి చెందిన నిందితుడు కొమ్మ వివేకానంద రెడ్డి ఆలియాస్‌ కిషోర్‌ రెడ్డి (37) కొద్ది కాలం ప్రవైయిట్‌ టీచర్‌గా పనిచేస్తూ వచ్చిన జీతం డబ్బు తన జల్సాలకు ఖర్చు కావడంతో తన తోటి ఉపాద్యాయులతో స్నేహంగా మంచివాడిగా నటిస్తూనే వారి వద్ద త్వరలోనే తిరిగి ఇస్తానని డబ్బులు, బంగారు నగలను తీసుకొని వారికి తిరిగి ఇవ్వకుండా సహోద్యోగులను మోసం చేసిన సంఘటనలో నిందితుడుపై ఆంధ్రప్రదేశ్‌లో మూడు కేసులు నమోదు కావడంతో నిందితుడు రెండు నెలలు జైలు జీవితం గడిపిన అనంతరం నిందితుడు తన మకాంను హన్మకొండకు మార్చుకున్నాడు. ఇక్కడ నిందితుడు కొత్త పేరుతో ఓ ప్రవైయిట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూనే మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాక కొద్ది రోజుల అనంతరం నిందితుడు అందులో పనిచేసే మరో మహిళా ఉపాధ్యాయురాలి పరిచయం చేసుకొన్నాడు. తనకు వరంగల్‌ ఎన్‌.ఐ.టి లో పరిచయస్తులు వున్నారని ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని సదరు మహిళా ఉపాధ్యాయురాలిని నమ్మించి ఆమెవద్ద ఎనిమిది లక్షల రూపాయలతో పాటు ఆమె కొడుకు ఎన్‌.ఐ.టిలో సీటు ఇప్పిస్తానని 60గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని అక్కడి మకాం మార్చాడు. ఇదే రీతిలో నిందితుడు పేరు మార్చుకొని మరో ముగ్గురు బాధితుల నుండి ఇదే తరహలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసారు. నిందితుడు మోసంతో దోచుకున్న సోమ్ముతో జల్సాలు చేయడంతో పాటు, ఇంటి గృహోపరకరణాలు, బంగారు ఆభరణాలు చేయించుకున్నాడు. ఈ రోజు తాను నివాసం వుంటున్న కిరాయి ఇంటినుండి సామాను తరలిస్తుండుగా పోలీసులు నిందితుడి పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన నేరాన్ని అంగీకరించాడు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ పోలీస్‌ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఏసిపి అభినందించారు. అదే విదంగా ప్రైవేట్ పాఠశాల యాజమానులను ఉద్దేశించి కొత్తగా జాయిన్ అయ్యే టీచర్ల యొక్క పూర్తి వివరాలు మరియు వారు ఎక్కడ పని చేసి వచ్చారో, వారి పై ఏమైనా కేసులు ఉన్నాయో విచారించిన తర్వాతనే స్కూల్ లో జాయిన్ చేసుకోగలరని ఏసీపీ గారు విజ్ఞప్తి చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular