Friday, January 24, 2025

ప్రధాని కుర్చీ కాపాడుకోవడానికే కేంద్ర బడ్జెట్ -వేముల సాంబయ్య గౌడ్

*తెలంగాణ బిజెపి ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి*

*కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన నరేంద్ర మోడీ*

*తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపును మోడీ వీడాలి లేకుంటే ప్రతిఘటిస్తాం*

నర్సంపేట మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్

పార్లమెంటులో బిజెపి ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుర్చీని కాపాడుకోవడానికి మాత్రమే అని నర్సంపేట మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రణాళికలు పొందుపరుచకుండా తెలంగాణపై వివక్షను,కక్ష సాధింపును బిజెపి ప్రభుత్వం ప్రదర్శించిందని,దీనికి తెలంగాణ బీజేపీ ఎంపీలు నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బడ్జెట్ తీరుపై నైతిక బాధ్యతగా తెలంగాణ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం అంటే కేవలం ఏపీ రాష్ట్రానికే కాదని తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించాలనే సోయి నరేంద్ర మోడీకి లేదని, కేవలం నరేంద్ర మోడీ బీహార్, ఏపీ రాష్ట్రలకు మాత్రమే నిధులు కేటాయించి హైదరాబాద్ మహానగరానికి నిధులు కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని,మెట్రోకు నిధులు కేటాయించకుండా, రింగ్ రోడ్డు విస్తరణకు నిధులు ఎందుకు కేటాయించలేదో తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గెలిపించినటువంటి జెజెపి ఎంపీలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు కేటాయించే విధంగా ఎంపీలు తమ బాధ్యతను నెరవేర్చాలని, నరేంద్ర మోడీకి బానిసలుగా కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బాధ్యతగా మేదలాలని వారు సూచించారు. కేంద్ర బడ్జెట్ కేవలం మోడీ కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే అని ఈ సందర్భంగా విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular