ఒంటిమిట్ట న్యూస్
తేజ రిపోటర్ దాసరి శేఖర్
అయోధ్య రామయ్య పూజిత అక్షింతలు ఒంటిమిట్ట మండలంలోని ప్రతి పంచాయతీకి ప్రతి గ్రామానికి చేర్చాలని జన సంపర్క్ అభియాన్ జిల్లా సహా ప్రముఖు లు వి.చిక్కన్న, మురళీమోహన్ రెడ్డి, మండల ప్రముఖ్ లు వేణుగోపాల రాజు, శివ రాజు లు అన్నారు. శనివారం ఒంటిమిట్ట మండల కేంద్రంలో జన సంపర్క్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న కుటుంబాలకు అక్షింతలు చేరవేస్తామన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు మురళి, ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి, యానదయ్య, ప్రసాద్, సుబ్బారెడ్డి, శేషారెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బరాయుడు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామానికి అయోధ్య పూజిత అక్షింతలు
RELATED ARTICLES