TEJA NEWS TV DHONE
డోన్ నియోజకవర్గ కస్టర్ లోని బేతంచెర్ల, ప్యాపిలి,డోన్ మండలాలకు సంబంధించిన నూతనంగా ఎన్నికైన క్షేత్ర సహాయకులకు ఉపాధి పథక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డోన్ ఏ.పి.ఓ.సుకూర్, ప్యాపిలి ఏ.పి.ఓ.రమణ,బేతంచెర్ల ఏపీఓ శేషన్న లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్లస్టర్ ఏ.పీ.డి. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన క్షేత్ర సహాయకులకు శిక్షణలో భాగంగా వారికి వివరిస్తూ ఉపాధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు అందులో చేపట్టినటువంటి పలు రకాల పనులు వాటి యొక్క కొలతలు గురించి తెలియజేస్తూ ప్రతి క్షేత్ర సహాయకులు ఉపాధి పథకంలో వేతన దారులకు 300 రూపాయలు కూలి పడాలి అంటే ఎంత పని చేయాలి కొలతలు ఏ విధంగా ఇవ్వాలి జాబ్ కార్డ్ నిర్వహణ,సెవెన్ రిజిస్టర్ల నిర్వహణ మొదలగు అంశాల గూర్చి వారికి తెలియజేశారు.
ప్రతి వేతనదారులకు ప్రతిరోజు ఉపాధి పథకం ద్వారా చేసే పనిలో 300 రూపాయలు కూలీపడేలా ప్రతి ఒక్క క్షేత్ర సహాయకులు పనిచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ టి.ఎ,ప్లాంటేషన్ సూపర్వైజర్ టి.ఏ లు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క వేతన దారులకు మూడు వందల రూపాయలు కూలీ పడేలా క్షేత్ర సహాయకులు చూడాలి – క్లస్టర్ ఏ.పీ.డి.నరసింహారెడ్డి
RELATED ARTICLES