Saturday, February 15, 2025

ప్రజాపాలన గ్రామసభల పర్యవేక్షణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా *అన్నపురెడ్డిపల్లి  మండలంలో గురువారం జరుగుతున్న పలు గ్రామసభలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే*

*గ్రామసభల నిర్వాహణలో అధికారులు సభ ప్రారంభించిన వెంటనే నాలుగు పథకాలకు సంబందించిన పూర్తి సమాచారం ప్రజలకు విపులంగా వివరించి అపోహలు తొలగించాలి*

*నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గ్రామసభలు నిర్వహిస్తున్నాం*

*సాంకేతిక కారణాల వల్ల నియోజకవర్గంలో పలుచోట్ల అర్హుల పేర్లు నమోదు కాలేదు అలాంటి వారికి అన్యాయం జరగనివ్వను*

*లిస్ట్ లో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దు అలాంటివారు అధికారులకు దరఖాస్తులు అందించండి మీ దరఖాస్తులు పరిశీలించిన తరువాతే అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం*

*ఇందిరమ్మ యాప్ ద్వారా చేసిన సర్వేలో ప్రస్తుతం పేర్లు వచ్చినవారు అర్హులుగా ఉండి పేర్లు రానివారికి విడతలవారీగా ఇండ్లు మంజూరు చేస్తాం*

*రాజకీయ లబ్ధికోసం గొడవలు సృష్టించే వారి మాటలు నమ్మవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం*

*గత ప్రభుత్వ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు వారి రాజకీయ చదరంగంలో పావులుగా మారవద్దు*

*రాబోయే నాలుగు సంవత్సరాలలో పేద ప్రజలకు నియోజకవర్గ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందించి వారి కళ్ళలో ఆనందం చూడటమే నా చిరకాల కోరిక*

*రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ ఇప్పటినుంచి ప్రతిరోజు మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారులు కొత్త రేషన్ కార్డులు మంజూరు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు*

*రైతుభరోసా గతంలో వచ్చిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు నూతనంగా పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు కాబడిన వారు గతంలో రైతు భరోసా రానివారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి*

*ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉపాధిహామీ పథకం ద్వారా ఇవ్వటం జరుగుతుంది 2023 – 2024 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసినవారు కనీసం భూమిలేని వారు ఈ పథకానికి అర్హులు జాబ్ కార్డ్ ఆధారంగా ఈ పథకం వర్తిస్తుంది.*  *ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు లేనివారు మండల ఎంపీడీవో కార్యాలయం ఉపాధిహామీ విభాగంలో జాబ్ కార్డు పొందే అవకాశం ఉంది*

*అశ్వారావుపేట ఎమ్మెల్యే*
*జారె ఆదినారాయణ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular