Saturday, January 18, 2025

ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం పోలీసులకే -వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా IPS

తేజ న్యూస్ టివి ప్రతినిధి

పోలీస్‌ ఉద్యోగంలో చేరి ఖాకీ యూనిఫారాన్ని ధరిస్తునందుకు మనమందరం గర్వపడాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ నూతన పోలీస్‌ కానిస్టేబుళ్ళకు సూచించారు. తొమ్మిది నెలల పూర్తిచేసుకొని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించేందుకుగాను నూతనంగా బాధ్యతలు చేపట్టిన 578 పోలీస్‌ కానిస్టేబుళ్ళతో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం సమావేశమయ్యారు. ఇటీవల వివిధ పోలీస్‌ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 376 మంది సివిల్‌ కానిస్టేబుళ్ళు ఇందులో పురుషులు 244 మంది కాగా, 123 మంది మహిళా పోలీస్‌ కానిస్టేబుళ్ళు వున్నారు. అలాగే శిక్షణ పూర్తి చేసిన వారిలో ఆర్మూడు రిజర్వ్‌ విభాగానికి చెందిన మొత్తం 211 మందిలో 168 పరుషులు కాగా, 43 మంది మహిళ ఆర్మూడ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లు వున్నారు. ఈ సందర్బంగా 376 మంది సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ళకు వరంగల్‌ పోలీస్‌  కమిషనరేట్‌ పరిధిలో వివిధ పోలీస్‌ స్టేషన్లకు కేటాయిస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసారు. ఇందులో సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 145 మంది కానిస్టేబుళ్ళు, వెస్ట్‌జోన్‌కు 119 మంది, ఈస్ట్‌ జోన్‌ పరిధిలో 68 కానిస్టేబుళ్ళు కాగా, మరో ఐదుగురు కానిస్టేబుళ్ళను ఇతర విభాగాలకు కేటాయించడం జరిగింది.
నూతన పోలీస్‌ కానిస్టేబుళ్ళను ఉద్యేశిస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూక ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం కేవలం పోలీసులకు మాత్రమే సాధ్యమని, ఈ పోలీస్‌ ఉద్యోగం ద్వారా ప్రజలకు మంచి చేయడం ద్వారా మీపై ప్రజలకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు, మీకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని, మీరు నిర్వర్తించే విధులతో సమాజంలో భరోసా కలిగితే పోలీసులు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, విధి నిర్వహణలో ఎన్నిఒతిళ్ళు వచ్చినే కంగారు పడకుండా ఓర్పు, సహనంతో విధులు నిర్వహించాలి. శాఖ పరమైన ఎలాంటి సమస్యలు వుంటే అధికారుల దృష్టికి తీసుకవస్తే వాటిని అధికారులు పరిష్కరిస్తారని పోలీస్‌ కమిషనర్‌ నూతన కానిస్టేబుళ్ళకు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్‌, ఏ.ఓ రామకృష్ణ, ఏసిపి అనంతయ్య,  ఆర్‌.ఐలు స్పర్జన్‌రాజ్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌తో పాటు పరిపాలన సిబ్బంది పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular