ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచర్ల గ్రామం లో సిడిపిఓ. భాగ్య రేణుక, ఏ సి డి పి ఓ. కృష్ణకుమారి ఆదేశానుసారం అంగన్వాడి కేంద్రాలలో సూపర్వైజర్ గోగినేని వెంకట్రావమ్మ ఆధ్వర్యంలో పోషకాహారం పై అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.
ఈ సందర్భంగా చిన్న పిల్లలకు బరువు, ఎత్తు చూసి , గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేసి రక్తహీనత నివారణకు 100 రోజుల ప్రత్యేక పోషణ కార్యక్రమం లో భాగంగా పల్లి చిక్కిలు, రాగి పిండి, సజ్జ పిండి, బెల్లం, ఖర్జూరం తదితర పోషకాహార కిట్లు ఇవ్వడం జరిగింది.
ప్రాథమిక పాఠశాలలో ఏ.యన్.యం.సునీత, ఆశా కార్యకర్తలు కలిసి విద్యార్థులకు హెచ్.బి. పరీక్షలు చేసి ఐరన్ మాత్రలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గోగినేని వెంకట్రావమ్మ , జలజీవన్ మిషన్ భాగ్యలక్ష్మి , ప్రధానోపాధ్యాయులు, లక్ష్మీనారాయణ, అంగన్వాడి కార్యకర్తలు జి. నిర్మల, సామ్రాజ్యం, ఎ.యన్.యం.సునీత, ఆశ కార్యకర్తలు, తల్లులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారం పై అవగాహన
RELATED ARTICLES