Friday, January 24, 2025

పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన డ్వాక్రా మహిళ

TEJA NEWS TV :

వరదయ్యపాలెం

నాగలక్ష్మి గ్రూపులో సభ్యురాలుగా ఉన్న నవనీతమ్మ జగన్మోహన్ రెడ్డి తనకు అందజేసిన వైఎస్సార్ ఆసరాలో అధికారులు తనను మోసం చేశారని,తనకు న్యాయం చేయాలని మరోసారి స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు పిర్యాదుసమర్పించారు. ఇందిరానగర్ గ్రామ సమాఖ్య విఓఏ సంఘమిత్రగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో అధికారులతో కలసి చేసిన అవకతవకలు వలన తీవ్రంగా నష్టపోయానని ఆమె పేర్కొంది.బ్యాంకులో లోన్లు తీసుకుని బకాయిలు పడి ఉన్న వారికి జగనన్న ప్రభుత్వం విడతలవారీగా సంఘ అకౌంటుకు జమచేయడం జరిగింది.ఇలా ఉండగా తన అకౌంట్ నందు జమ కాలేదని,ఎస్బిఐ నుండి గ్రూప్ సభ్యులకు బ్యాంకు ఖాతా ద్వారా కాకుండా,నగదు చెల్లింపుల కొఱకు డ్రా చేసినట్టు ఆమె తెలిపారు.ఈ సమయంలో అప్పటి సంఘమిత్ర విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలపై తొలగించబడింది. వైయస్సార్ ఆసరా కింద విడతలవారీగా లోను బకాయిలను ప్రభుత్వం జమచేసిన,తనకు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారని తెలిపింది.ఇదే విషయమై గతంలో పోలీస్ లకు పిర్యాదు చేయగా అధికారులు కొంత మొత్తం ఇప్పించారని, ఇంకా తనకు రావలసి ఉందని,దీనిపై చర్యలు తీసుకోవాలని, స్థానికస్టేషన్ హౌస్ ఆఫీసర్ కు నవనీతమ్మ ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular