Sunday, January 18, 2026

పోలీసులు అంటే ప్రజలకు నమ్మకం కలిగేలా ఉండాలి – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌



తేజ న్యూస్ టివి ప్రతినిధి,

ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ నెక్కొండ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం నెక్కొండ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు.  అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ తో పాటు కిట్‌ ఆర్టికల్స్‌ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండిరగ్‌ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డిసిలు, మిస్సింగ్‌, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. పోలీసు స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఈస్ట్ జోన్‌ డీసీపీ అంకిత్ కుమార్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, నెక్కొండ సిఐ శ్రీనివాస్, ఎస్‌.ఐ మహేందర్ పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular