ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం పాత హరిజనవాడ కు చెందిన ఇంద్రకంటి యాకోబు, కొత్త హరిజనవాడకు చెందిన వేల్పుల సువర్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరారు.
ఇద్దరు మేజర్లు కావడంతో నందిగామ పోలీస్ స్టేషన్ లో వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దని వాళ్ళు ఇద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు.