సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో సోమవారం రోజు పోచమ్మ మైసమ్మ తల్లుల ప్రధమ వార్షికోత్సవమ్ కన్నుల పండుగలాగ జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ఆలయ నిర్మాణ ధాత సంగెం మండల ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి విచ్చేసి అమ్మవార్లకు అభిషేకం అర్చనలు చేయడం జరిగింది గ్రామం లోని మహిళలు అన్ని కుల పెద్దమనుషులు పాల్గొని గ్రామం సుభిక్షం గా ఉండాలని పాడిపంటలు వర్షాలు సమృద్ధి గా పడాలని గ్రామంలో అందరికి ఆయురారోగ్యాలతో మంచి జరగాలని తండోప తండాలుగా వచ్చి అమ్మవార్లకు పసుపు కుంకుమ కలిపినా నీళ్లతో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమం లో గ్రామస్థులు అన్ని కుల పెద్ద మనుషులు పాల్గొన్నారు.
పోచమ్మ, మైసమ్మ తల్లుల ఘనంగా ప్రధమ వార్షికోత్సవ వేడుకలు
RELATED ARTICLES