భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
29-10-2024
*క్రీడాకారునికి ప్రథమ చికిత్స అందించిన ఎమ్మెల్యే*
కొత్తగూడెం ప్రకాశం మైదానంలో రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ , జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు సహచర ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పుట్టినరోజు పురస్కరించుకొని క్రీడాకారుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఆ తరువాత కబడ్డీ పోటీలను ప్రారంభించి క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ క్రీడాకారుడు ఆటలో భాగంగా కాలుకి గాయం అవ్వగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ, ప్రధమచికిత్స అందించి క్రీడాకారుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబడ్డీ ఛాంపియన్ షిప్ ట్రోఫీ క్రీడల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
RELATED ARTICLES