కామారెడ్డి:
సామాజిక బాధ్యతగా పేద కుటుంబాలకు చెందిన వధువులకు ఉచితంగా పుస్తె మేట్టలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బీబీపేట గ్రామానికి చెందిన అయిత బాలచంద్రగుప్త గారు. ఇటీవల, బీబీపేట గ్రామానికి చెందిన వధువు వడ్ల రవళికి మరియు కామారెడ్డి పట్టణానికి చెందిన లలితా బాలచంద్రం గుప్తా వధువుకు పుస్తె మరియు మేట్టెలు ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా అయిత బాలచంద్రగుప్త గారు మాట్లాడుతూ – “ఇప్పటివరకు 27 పేద హిందూ వధువులకు పుస్తె మేట్టలు ఉచితంగా అందించాను. వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద హిందూ కుటుంబాలకు తగినంత సహాయం అందించేందుకు నా వంతుగా చేస్తున్న ఈ ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది. ఎవరైనా అర్హులయితే, నన్ను సంప్రదించవచ్చు” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లలిత రామచంద్రన్ గుప్తా, గోవిందు భాస్కర్ గుప్తా, వాలిపిశెట్టి లక్ష్మీరాజ్యం గుప్తా, విశ్వనాధుల మహేష్ గుప్తా, వధువు-వరుడు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలందుకుంది.
పేద వధువులకు ఉచితంగా పుస్తె మేట్టలు వితరణ
RELATED ARTICLES