తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం గ్రామానికి చెందిన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుండెటి సంజీవ ఆకస్మితికంగా మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేని కుటుంబం గా మారింది. అలాంటి సమయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చి మండలం, సంగెం ,గ్రామ వాట్సాప్ ద్వారా ఆ పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని పులి రాజశేఖర్ గ్రూపులో ఉన్న సభ్యులను విన్నవించుకోగా గ్రామంలో దాతల మేము సైతం అంటూ ముందుకు వచ్చి వారి సహకారంతో విరాళాలు 13,620.రుపాయలు సేకరించి మృతుని భార్య, కొడుకు అందించి,ఆ పేద కుటుంబానికి దాతలు అండగా నిలిచారు, ఆర్థికంగా వెనుకబడిన ఆ కుటుంబానికి కొండంత అండగా ఉండి ఆర్థికంగా భరోసా కల్పించి దాతలు ద్వారా ఆర్థిక సాయం దాతల ద్వారా సేకరించినందుకు పులి రాజశేఖర్ కు పలువురు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సేకరించిన వారు పులి రాజశేఖర్,దాతలు మెట్టిపల్లి రమేష్,గుండేటి కుమార్ స్వామి, ఆగపాటి రాజు,గుండేటి శ్రీకర్,పులి సాంబయ్య,గుండేడి కృష్ణ, గుండేటి కుమార్, లక్ష్మణ్, తదిరులు పాల్గొన్నారు.
పేద కుటుంబానికి ఆర్థిక సహాయం
RELATED ARTICLES