సంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం లో సెర్ఫ్ సిసి, ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ బొజ్జ సురేశ్ జ్యోతి దంపతుల పెళ్లిరోజు పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.బొజ్జ సురేశ్ జ్యోతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా అనాధ బాల, బాలిక పిల్లలకు, నిరుపేద, పేద పిల్లలకు, పేదల సేవలో బొజ్జ దంపతులు* వృద్ధులకు బట్టల పంపిణీ,ఉచితంగా పుస్తకాలు, లాంగ్ నోట్ బుక్స్, స్టేషనరీ, పెన్నులు, స్వీట్స్, బిస్కెట్లు, కూల్ వాటర్ పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బొజ్జ సురేశ్ మాట్లాడుతూ ఇక్కడ ఉండే పిల్లలు అంతా నిరుపేద పేద అనాధ పిల్లలని అన్నారు. పిల్లలకు వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభానికి ముందే నోట్ బుక్స్, స్టేషనరీ అవసరం ఉండడంతో వారికి సహకరించడానికి అందించమని అలాగే పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, స్వీట్స్, పంపిణీ చేయడం జరిగిందని పిల్లలు బాగా చదువుకోవాలని కోరారు. పిల్లలు క్రమశిక్షణతో మంచి నడవడికతో ఒక లక్ష్యం పెట్టుకొని చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకోవాలన్నారు. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయని, ఉన్నత స్థానాలు చేరుతారన్నారు. అందివచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తల్లి బొజ్జ కొమురమ్మ, కుమార్తెలు బొజ్జ కావ్య శ్రీ,బొజ్జ కారుణ్యశ్రీ,ఉపాధ్యాయులు మాంకాల యాదగిరి, పేర్ల రాజు, కరుణశ్రీ, కిషన్ కుమార్,నాగేష్, మొగిలి,విక్రమ్,సిబ్బంది, విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.