TEJA NEWS TV :
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద వర్గాలు వైద్య చికిత్సకు దూరం కాకూడదనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నట్టు తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి గుర్తు చేశారు.శుక్రవారం ఆంబాకం సచివాలయ పరిధిలోని పుదుకుప్పం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఎంపిటిసి సర వన అధ్యక్షతన,ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంచార్జ్ పంచాయతీ సెక్రటరీ మాధవి పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన ఇటువంటి కార్యక్రమాలను చూడలేదన్నారు.నిరుపేదలు వ్యాధులకు గురైతే ఏ ఆసుపత్రికి వెళ్లాలో,వైద్య చికిత్స తదితర వివరాలు తెలిసేవి కావన్నారు.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే పేదల సంక్షేమం కోసం అనేక విన్నుతన కార్యక్రమాలను ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.ఇందులో భాగంగానే ప్రజల ముంగిట్లోకే వైద్య చికిత్స అందాలన్న ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.గత ఏడాది జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగినట్టు ఆయన గుర్తు చేశారు.దీన్ని నిరంతరం కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఆరోగ్య శిబిరంలో కేవలం వైద్య చికిత్స కాకుండా కంటి రోగులను కూడా పరీక్షించి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నమన్నారు.అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.తదనంతరం వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో ఆలయ చైర్మన్ బాలాజీ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం జగనన్న సురక్ష శిబిరాన్ని సందర్శించి రోగులు పొందుతున్న వైద్యాన్ని పరిశీలించారు.కాగా పుదుకుప్పంలో ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి 303 మంది రోగులు పాల్గొన్నారు.వీరిని దాసు కుప్పం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ గుణశేఖర్ ఆధ్వర్యంలో తిరుపతి ఆసుపత్రి చిన్న పిల్లల వైద్య నిపుణులు స్పందన,జనరల్ మెడిసిన్ శ్రీకాంత్ తదితరుల బృందం పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇందులో మహిళలు 148 మంది,పురుషులు145,విద్యార్థులు 10 మంది,కంటి పరీక్షలు 18 మంది,కంటి అద్దాలు ఐదు మందికి ఇచ్చినట్టు పంచాయతీ సెక్రటరీ మాధవి పేర్కొన్నారు.సురక్ష శిబిరంలో రోగులకు అవసరమైన బిపి,చక్కెర వ్యాధి వంటి వాటికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్లో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు.దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరో స్టాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ఎంఈఓ రవి, దాసుకుప్పం పీహెచ్సీ ఎంపీహెచ్ఈవో సుబ్రహ్మణ్యం,ఆరోగ్య పర్యవేక్షకులు నాగజ్యోతి,ఫార్మాసిస్టు భార్గవి,ఎంఎల్హెచ్పి మహాలక్ష్మి, ఏఎన్ఎంలు సుమలత,స్వాతి,లావణ్య,లతాదేవి,ఇంద్రాణి,సరస్వతి, ఆశా వర్కర్లు విజయనిర్మలమ్మ,లలిత,మునికుమారి,రేవతి తదితరులు పాల్గొన్నారు.
పేదలు వైద్యచికిత్సకు దూరం కాకూడదనే జగనన్న ఆరోగ్య సురక్ష
RELATED ARTICLES