TEJA NEWS TV
వైద్య విద్య ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్ పై తక్షణమే విచారణ జరిపించి నీట్ పరీక్ష నిర్వహించిన N.T.A సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వీరేశ్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యా సంస్థల బందును విజయవంతం చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఈరోజు జూలై 4 గురువారం రోజున విద్యా సంస్థలన్నీ బంద్ చేయాలని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షకు వ్యతిరేకంగా అసెంబ్లీలలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నీట్ పరీక్ష పై ఏమాత్రం మాట్లాడటం లేదు తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దుచేసి పేద ప్రజలకు అందని ద్రాక్షగా ఉన్న ఉన్నత చదువులకు ప్రతిభ గల ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. పెత్తందారుల నుంచి పేపర్ లీకేజీ కోసం ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి 30 లక్షల రూపాయల వరకు లంచాలు తీసుకున్న ఎన్ టి ఏ సంస్థను రద్దుచేసి దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. కోసిగి మండలంలోని అన్ని పాఠశాలలను బంద్ చేస్తూ నీట్ పరీక్షకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులను బందులో భాగస్వాములు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సహయ కార్యదర్శి వీరేష్ నరసింహులు నబి మళ్ళీ వెంకటేష్ మల్లికార్జున గురుస్వామి పడేసా బంజి రాజు అభి చార్లెస్ నవనీత్ హరి పురుషోత్తం జాన్ ఈ కార్యక్రమంలో మండల సహయ కార్యదర్శి వీరేశ్ తో పాటు AISF సభ్యులు పాల్గొన్నారు.