భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ తమ పోలీస్ సిబ్బందితో కలిసి బెండలపాడు గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకొని ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 6 మొబైల్ ఫోన్లు రూ. 8160 నగదు, నాలుగు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విజ్ఞప్తి: చట్ట విరుద్ధ కార్యకలాపాలు వ్యక్తిగతంగా కుటుంబానికి, సమాజానికి హానికరం కాబట్టి, ప్రజలందరూ ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి. సమాజంలో శాంతి, భద్రతను కాపాడాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
హెచ్చరిక: ఎవరైనా ఇలాంటి చట్టభిరుద్ధమైన చర్యల్లో పాల్గొంటే, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు ఏవైనా నేర సంబంధిత సమాచారం ఉంటే 100 నెంబర్ కు కాల్ చేయండి లేదా చండ్రుగొండ పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి. మీ సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది.
పేకాట రాయుళ్లు అరెస్ట్
RELATED ARTICLES