*_అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఫిర్యాదు మేరకు_*
ఈ రోజు పెద్దహ్యట గ్రామాన్ని సందర్శించి రూట్ మ్యాప్ పరిశీలించిన ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ అసిస్టెంట్ మేనేజర్ రాఘవేంద్ర
AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ
ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో అధికారులకు “AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ గ్రామస్తులు సమస్య తెలియజేస్తూ.విద్యార్థులు ఉన్నంత చదువులు చదువుకోవాలంటే మండల కేంద్రానికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని. అలాగే ప్రజలకు కూడా బస్సు సౌకర్యం కల్పించాలని. ఆదోని డిపో ఆర్టీసీ అధికారులకు సమస్యలు తెలియజేశారు.
స్పందించి మా గ్రామాన్ని సందర్శించి రూట్ మ్యాప్ పరిశీలించినందుకు “అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)’తరఫున ఆదోని డిపో అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ సందర్భంగా ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.”AISF విద్యార్థి సంఘం ఫిర్యాదు మేరకు పెద్దహ్యట గ్రామం విద్యార్థులు ప్రజలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూట్ మ్యాప్ పరిశీలించి ఉన్నంత అధికారులకు నివేదిక పంపిస్తాము అని వారు అన్నారు.ఉన్నంత అధికారుల ఆదేశాల మేరకు ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ఎలా ఏర్పాటు చేయాలనేది నివేదిక వచ్చిన తర్వాత AISF నాయకులకు గ్రామస్తులకు ప్రజలకు తెలియజేస్తామని వారు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ గ్రామస్తులు కట్టే రాజు శేషప్ప కట్టే నాగప్ప మల్లికార్జున శేఖర్ H.వీరభద్రప్ప అరవింద్ బాల అడివప్ప శివబసవ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.