TEJA NEWS TV : కర్నూలు జిల్లా
పెద్దకడుబూరు మండలం హెచ్ మురవణిలో ముగ్గురు వ్యక్తులతో వచ్చి దొంగ బాబా ఘరానా మోసానికి పాల్పడ్డారు.
మాయ మంత్రాలతో డబ్బులు రెండింతలు చేస్తానని మాయ మాటలు చెప్పి రూ 21 లక్షలతో దొంగ బాబా ఉడాయించాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పిబి వెంకటేశ్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డబ్బులు రెండింతలు చేస్తానని మాయ మాటలు చెప్పి రూ 21 లక్షలు ఓ ఇంట్లో ఉంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనం ముగించుకొని వచ్చే సరికి డబ్బులు రెండింతలు అవుతాయని చెప్పారు.
బాధితులు దర్శనం ముగించుకొని వచ్చే సరికి రూ 20 లక్షలుతో దొంగ బాబా ఉడాయించారు.
దొంగ బాబాతో సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.
పరారిలో ఉన్న ముగ్గురిలో ఒక్కరిని పోలీసులు అరెస్టు చేశారు.
దొంగ బాబా సహాయకుడు మహబూబ్ నగర్ జిల్లా శాశంపల్లి గ్రామానికి చెందిన సందుల రవిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
పెద్దకడుబూరు: దొంగ బాబా ఘరానా మోసం
RELATED ARTICLES