పొలం సమస్య పరిష్కారం కాలేదని గత నాలుగు సంవత్సరాల నుంచి తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయి చివరకు తాసిల్దార్ కార్యాలయం లోనే పెట్రోల్ పోసుకొని బుధవారం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వివరాల్లోకెళితే మండల పరిధిలోని వందగల్లు గ్రామానికి చెందిన సరస్వతి అనే మహిళ పొలం సమస్య పరిష్కారం కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి మండల తాసిల్దార్ రుద్రగౌడ్ కు ఎన్నో వినతి పత్రాలు అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింద ని తీవ్ర మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.గతంలో పలుమార్లు అర్జీ ఇచ్చిన సమయంలో సైతం కంట తడి పెట్టిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. పెట్రోల్ పోసుకున్న సమయంలో కార్యాలయానికి వచ్చిన ప్రజలే అక్కడ మేల్కొని పెట్రోల్ బాటిల్ ను ఆమె నుంచి తీసుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే కార్యాలయంలో ఉన్న నీటితో తడిపేశారు. చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనంపై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.
పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య యత్నం
RELATED ARTICLES