Friday, December 12, 2025

పెండ్యాల గ్రామంలో ప్రభుత్వ యునాని వైధ్యశాలలో వైధ్యులను సిబ్బందిని వెంటనే నియమించాలి

యన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామం

పెండ్యాల గ్రామం లో ప్రభుత్వ యునాని వైధ్య శాల ” లో  వైధ్యులను, సిబ్బంది ని వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ వారిని డిమాండ్ చేసిన బిజెపి. పార్టీ రాష్ట్ర నాయకులు ” బిజెపి. సైద

*యన్టీఆర్ జిల్ల కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామం లో గత ప్రభుత్వం నుండి రెండున్నర సంవత్సరాలకు పైగా మూసి ఉన్న ప్రభుత్వ యునాని వైధ్యశాల ను  తెరచి ఆయుష్ వైధ్యులను, సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ శాఖ వారిని  బిజెపి పార్టీ . సీనియర్ నాయకులు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మాజీ ఉపాధ్యక్షులు ” బిజెపి. సైద ” డిమాండ్ చేశారు .*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే  పెండ్యాల గ్రామం  మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. మైనారిటీలకు పెట్టింది పేరని బిజెపి సైదా అన్నారు.*

*మైనారిటీలు ఎక్కువగా తమ అనారోగ్యాలకు , వ్యాధులకు , తలనొప్పి కి, శారీరిక  మైన నెప్పు ల నివారణ కు యునాని ఔషధ తైలములు ఎక్కువగా ఉపయోగిస్తారని బిజెపి. సైదా అన్నారు.*

*కాబట్టి గతంలో ఇక్కడ ప్రభుత్వ యునాని వైధ్య శాలను ఏర్పాటు  చేయడం తో ఇక్కడి ప్రజలు యునాని తైల ములకు, ఆయుర్వేద మందులకు అలవాటు పడి ఉన్నారని అన్నారు .*

*చాలా రోజులుగా ప్రభుత్వ యునాని వైధ్యశాల మూసివేసి ఉండటం తో ఎవరు పట్టించుకోకపోవడంతో  వైధ్యశాల చుట్టూ గడ్డి , పిచ్చి మొక్కలు అడవి లాగ దట్టంగా పెరిగాయని  బిజెపి. సైదా ఆవేదన వ్యక్తం చేశారు.*

*ఆయుష్ శాఖ వారు యుద్ద ప్రాతిపదికన మూసి ఉన్న ప్రభుత్వ యునాని వైధ్యశాల ను వెంటనే తెరచి వైధ్యులను , సిబ్బందిని  వెంటనే నియమించాలని బిజెపి. సైదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే బిజెపి. పార్టీ ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular