Sunday, January 18, 2026

పూర్వ విద్యార్థుల సమావేశం…2000 సంవత్సరం బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 25 సంవత్సరాల తర్వాత సమావేశం

TEJA NEWS TV TELANGANA
బిబిపేట్ మండల కేంద్రంలోని తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ రోజు 2000 సంవత్సరంలో 10 వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా 25 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించుకోవడం జరిగింది.

ఈ సన్మాన కార్యక్రమంలో కాశీనాథ్ శర్మ,మాధవరెడ్డి,గోవర్ధన్ రెడ్డి,విజయ్ కుమార్,సుతారి అంజయ్య,తుమ్మ రామచంద్రం, ఎదుల్ల ఇంద్రసేనారెడ్డి,కిష్టరెడ్డి, ఆనందరావు,విశ్వమోహన్,ఎల్లము,రమేష్ శర్మ లు పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ఉపాధ్యాయులకు ఎనలేని ఆనందం కలుగుతుందని,కష్టాలకు కృంగిపోకూడదని జీవిత లక్ష్యాన్ని చేరుకునేంతవరకు విశ్రమించకూడదని పూర్వ విద్యార్థులకు సూచించారు.సమాజ శ్రేయస్సుకు సాధ్యమైనంత వరకు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.పూర్వ విద్యార్థులు వారు 25 సంవత్సరాల క్రితం పాఠశాలలో పొందిన అనుభవాలను పంచుకుని ఆనందంతో గడపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular