తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం మంగళవారం రోజున కాపుల కనపర్తి పీహెచ్సీని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
తనిఖీలో డాక్టర్స్ ఏఎన్ఎం విధులకు ఆలస్యంగా రావడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ హాస్పిటల్
పీహెచ్సీలో గడువు తీరని మందులు ఉండడం వల్ల డాక్టర్ పై చర్యలు తీసుకోవలసిందిగా డిఎం అండ్ హెచ్ ఓ సాంబశివరావు ను ఆదేశించారు అలాగే గ్రామంలో ప్రతి పల్లె డాక్టర్లు, ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు సక్రమంగా వారి డ్యూటీ లు చేయాలని చెప్పారు ఎవరైనా విధులకు హాజరు కాకుండా వుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు, అలాగే గవిచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను పరిశీలించారు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నే వారికి ఇసుక,కంకర ప్రభుత్వం తరఫున తక్కువ ధరకు వస్తుందని అలాగే మేస్త్రీ పని నేర్చుకొనే వారికి పని నేర్పించి వారికి ఆర్థిక పరంగా పని కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంగెం మండల ఆపీసర్ ఎంపిడిఓ రవీందర్, గ్రామ కార్యదర్శి జిల్లా అధికారులు పాల్గొన్నారు.




