నియోజక వర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన పిర్యాదుల పెట్టెలో మండలానికి సంబంధించి ప్రజలు వేసిన పిర్యాదుల వివరాలను బీబీపేట మండల కేంద్రం లో స్థానిక MRO, MPDO లకు మండల బీజేపీ నాయకులు MLA గారి తరుపున దరఖాస్తులను అందజేయటం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్మారెడ్డి మాట్లాడుతూ MLA రమణ రెడ్డి గారు ప్రజలకు ఇబ్బందులు ఉంటే నేరుగా తనకే సంప్రదిస్తే పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టేను ఏర్పాటు చేశారని అందులో భాగంగా వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ, రేషన్ కార్డులకు సంబంధించిన పిర్యాదులను MRO గారికి, పించన్, పారిశుధ్యం కు సంబంధిన పిర్యధులను MPDO గారికి ఇవ్వడం జరిగిందని, గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ దృష్ట్యా అధికారులకు ఇవ్వడం కుదరలేదు అని అన్నారు. వీటి పరిష్కారం విషయంలో అధికారులు MLA గారికి వివరణ ఇస్తారని అన్నారు.
మండలానికి సంబంధించి MRO కీ 8 పిర్యాదులు, MPDO కి 23 పిర్యాదులు ఇవ్వడం జరిగింది.
పిర్యాదులు పరిష్కరించాలని MRO, MPDO లకు MLA తరుపున దరఖాస్తులు అందజేసిన బీజేపీ నాయకులు
RELATED ARTICLES