ఎన్టీఆర్. జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామం లో ఐ.సి.డి.యస్. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్.జి. ఉమాదేవి మరియు సి.డి.పి.ఓ. లక్ష్మి భార్గవి వారి ఆదేశాలతో కె. ఉషారాణి గ్రేడ్ – 1 సూపర్వైజర్ వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తల్లి పాల మీద అవగాహన కల్పించి తప్పనిసరిగా పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలని,6 నెలలు కేవలం తల్లి పాలు పట్టాలని సూపర్వైజర్ ఉషారాణి వారు వివరించారు .
ఎం.ఎల్.హెచ్.పి. సౌజన్య తల్లి పాల వలన తల్లికి, బిడ్డలకు కలిగే లాభాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో
గర్భిణీ మహిళల కు పోషకాహారలోపం తలెత్తకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం బ్యాగుల (న్యూట్రిషిన్ కిట్స్)ను గర్భిణీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని సర్పంచ్ మేరీ మరియు శాంతకుమారి వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు రామ దేవి, మేరీ రాణి, ఝాన్సీ, కుమారి,వైద్య సిబ్బంది మరియు గర్భిణీ స్త్రీలు,బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.
తల్లి పాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం
RELATED ARTICLES