
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
పాల్వంచ మండలం
28-5-2025
కొత్తగూడెం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి శాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (దన్సరి అనసూయ) కు పాల్వంచలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశానికి వచ్చినప్పుడు కొత్వాల మంత్రి సీతక్కను శాలువా,బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, మాలోతు రాందాస్ నాయక్, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మట్ట రాగమయి, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు లను కొత్వాల మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ జడ్పిటిసి ఎర్రం శెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, వాసుమల్ల సుందర్రావు, కాపర్తి వెంకటాచారి, మాలోత్ కోటి నాయక్, ఎర్రంశెట్టి మధుసూదన్ రావు, శ్రీలత రెడ్డి, అరుణ రెడ్డి, లింగయ్య నాయక్, అలెక్స్, ఎర్రం శెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.