TEJA NEWS TV:
హొళగుంద మండల కేంద్రంలోని బీసీ కాలనీ తెరుబజార్ నందు పారిశుద్ధ్య పనులను చేపట్టారు. పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్ తేజ టీవీ ప్రెస్ రిపోర్టర్ తో మాట్లాడుతూ డ్రైనేజీలో చెత్త వేయకూడదు. అలాగే తమ పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవాలని వారు కోరారు. చెత్తను బకెట్లులలో వేసి ఉంచండి. రోజు ఒక్కొక్క ఏరియాకు పంచాయతీ ట్రాక్టర్ వచ్చి మీ చెత్తను తీసుకువెళ్తారు. తడి చెత్త పొడి చెత్త డంపింగ్ యార్డ్ కి తరలిస్తారు.పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఎవరైనా చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అందుకుగాను ప్రజలు సహకరించాలని వారు కోరారు. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే వెంటనేమాకు తెలియజేయాలని వారు కోరారు.