ఎన్టీఆర్ జిల్లా, నందిగామ:
బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైన జర్నలిస్టు షాబాన్ పాష ప్రస్తుతం నందిగామ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆయనను పరామర్శించేందుకు పలువురు మీడియా మిత్రులు వచ్చారు.
భారత వనిత జర్నలిస్టు గాడిపర్తి సీతారామారావు, జూమ్ ఇన్ జర్నలిస్ట్ విలేఖరి సీతారామరాజు ప్రత్యేకంగా ఆసుపత్రికి చేరుకొని పాష ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మానసికంగా ధైర్యం చెప్పారు. మీడియా వర్గాలు పాష ఆరోగ్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి.
పాము కాటుకు గురైన జర్నలిస్టును పరామర్శించిన మీడియా మిత్రులు
RELATED ARTICLES



