Wednesday, February 5, 2025

పామాయిల్ రైతులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
13-9-2024

పామాయిల్ రైతులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలి*
*అశ్వారావుపేట మండలంలో జరిగిన పామాయిల్ రైతుల సదస్సులో పాల్గొన్న*
     — *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*

పామాయిల్ కు కేంద్ర ప్రభుత్వం తక్షణం మద్దతు ధర కల్పించాలని *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.

అశ్వారావుపేటలో శనివారం జరిగిన *పామాయిల్ రైతుల సదస్సులో* *మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు*, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులతో పాటు *కొత్వాల* పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *కొత్వాల* ను *అశ్వారావుపేట MLA జారే ఆదినారాయణ* *సన్మానించారు*.

*కొత్వాల* మాట్లాడుతూ అశ్వారావుపేట కేంద్రంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పామాయిల్ పండించే రైతులు ఎక్కువగా వున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచి, వారిని ఆదుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో *మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హన్మంతరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు Y వెంకటేశ్వర్లు, చౌగాని పాపారావు*, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular