భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
24-11-2024
పాల్వంచ మండలం
పాత పాల్వంచ మైసమ్మతల్లి దేవాలయంలో ఘనంగా అయ్యప్పస్వామి పడి పూజామహోత్సవం*
— *పడి పూజలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*
పాత పాల్వంచ *గడియకట్టలోని మైసమ్మతల్లి దేవాలయంలో* శనివారం రాత్రి *అయ్యప్పస్వామి పడి పూజను* ఘనంగా నిర్వహించారు. *పూజారులు పురాణం రామప్పశాస్త్రి, పురాణం పవన్ శాస్త్రి* ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పడి పూజా కార్యక్రమాల్లో *DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు* పాల్గొని, పూజలు చేశారు.
*గురుస్వామి మల్లెల నాగేంద్రం స్వామి* ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి భాజాగీతాలు ఆలపించారు. మహిళలు, స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో *మైసమ్మతల్లి దేవాలయం కమిటీ భాద్యులు మసనం శరత్, వంగా రమేష్, కోసూరి కిరణ్, మంగ్యా, మల్లేష్, కిలారి సుజాత, అపర్ణ, శిరీష, రాజ్యలక్ష్మి, రాఘవమ్మ, సీతమ్మ*, ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

