Thursday, January 23, 2025

పాత్రికేయుడి డిగ్రీలు పోలీస్ స్టేషన్ల మెట్లపై మోకరిల్లిన వేళ

పాత్రికేయుడను అభాసపాలు చేసిన దళితులు

నిజాయితీపరులు  జైల్లో లేదా సమాధులలో ఉంటారు అనే మాట పెద్దలు ఊరికే అనలేదు కాబోలు,  అబద్ధం చెప్పలేక  అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు నిజాన్ని నిర్భయంగా పాత్రికేయులు ప్రజలలో నింపే ప్రయత్నంలో భాగంగా అవినీతిలో  అబద్ధపు సాక్షాలతో  కొట్టుకపోయి   సమాధి అయిపోయిన కరుడుగట్టిన నిజాయితీ నీ ఆవాహన చేసుకున్న పాత్రికేయులు కోకొల్లలు అని మనం పుస్తకాలలో, సినిమాలలో చూసి ఉంటాము, అయితే అమరులైన పాత్రికేయులు కనబరిచిన నీతికి  అద్దం పట్టేలా  నేటికీ కూడా అడపా తడప అక్కడక్కడ పాత్రికేయులపై అక్రమంగా రివర్స్ అవుతున్న కేసులు నేటికీ మనం చూడొచ్చు.  అటువంటి సంఘటన   ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో  చోటుచేసుకుంది.
గత కొంతకాలంగా దళిత బంద్ విషయంలో  అక్రమాలు జరిగాయి తాము కట్టిన డబ్బులు తిరిగి రాలేదు అని తేజ న్యూస్ రిపోర్టర్ దగ్గర విన్నవించుకున్న దళితులు  తీరా వారి సమస్యని ఉన్నత అధికారుల,  ప్రజా ప్రతినిధుల వద్దకు తేజ న్యూస్ పాత్రికేయుడు  తీసుకువెళ్లి యావత్ రాష్ట్రమంతా జటిలం చేసి దళితులకు న్యాయం చేకూర్చే భాగంలో తన వృత్తిని నిజాయితీగా నిర్వర్తించి అంతిమంగా దళితులను వారి కి జరిగిన సంఘటనను  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యమని  కోరిన నేపథ్యంలో తేజ న్యూస్ విలేకరి దగ్గర వాయిస్ ఓవర్ ఇచ్చిన దళితులే మాకు భయం వేస్తుంది అని పోలీస్ స్టేషన్ కి  రావడానికి నిరాకరించి పాత్రికేయుడు కాళ్లు పట్టుకొని  వెనక్కి తగ్గడం ప్రస్తుతం మండల కేంద్రంలో చర్చనీరసంగా మారింది. అసలే నిమ్న జాతి  అందులోనూ నేటి కాలంలో ఎక్కువగా వివక్ష గురయ్యే ప్రజలు దళితులు, అప్పటి రాజుల కాలం నుండి ఇప్పటి రాజకీయ నాయకుల వరకు దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
గుడి దగ్గర నుంచి బడి వరకు  నీటి సరస్సు దగ్గర నుంచి  గాల్లో ఎగిరే గాలి మోటార్ లో పనిచేసే ఎయిర్ హోస్టర్స్ వరకు  దళితులు వివక్షకు గురవుతున్న సందర్భాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. వారి ఐక్యత లేని జీవితాలనే వారిని వివక్షకు గురి చేస్తున్నాయని, అని మేధావులు సైతం  ఎద్దేవా చేస్తున్నారు.  నేటి రాకెట్ సైన్స్ యుగంలో కూడా  డెమోక్రసీ ప్రజ్వలిస్తున్న తరుణంలో నేటికీ దళితులు అంటరానివారుగా ఉన్నాము అని భ్రమలో పడ్డారో ఏమో రేపటి తరానికి సైతం భయం పుట్టించేలా  వారు వెనుదిరిగిన  విధానం పాత్రికేయుడను అబాసపాలు చేయడమే కాకుండా పరోక్షంగా  వారి పిల్లలను సైతం ప్రశ్నించే తత్వాన్ని ఎదగకుండా పరోక్షంగా వారికి వారే తొక్కేసుకుంటున్నారు. అని పలువురు  విద్యావేత్తలు, దళితులపై  జాలి చూపిస్తున్నారు. గత కొంతకాలంగా దళితుల సమస్యలపై  పాటుపడే పాత్రికేయులను బలి తీసుకోవడం  వారి కంటిలో వారే గుచ్చుకున్నట్టు  అంటూ పలువురు  రాజకీయ నిపుణులు,మేధావులు,  వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. స్టేషన్లో ఫిర్యాదు చేసే ధైర్యం లేనప్పుడు రిపోర్టర్లకు ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చారు అంటూ  పలువురు దళితుల అజ్ఞానం పై నిప్పులు చెరుగుతున్నారు . ఇటువంటి సంఘటనలు దళితులు వారంతటికి వారే కొనితెచ్చుకుంట్టు ఉంటే    నాలుకలో నరం లేని వారిని ఏ పాత్రికేయుడు నమ్ముతాడు ఏ పాత్రికేయుడు వారి సమస్యలను వెలుగెత్తి చూపుతాడు . అబద్ధపు జీవనంతో తేజరిల్లుతున్న  వారి అజ్ఞానం పాత్రికేయులందరినీ ఆలోచించేలా చేస్తోంది . ఇదిలా ఉండగా ఇదే అవకాశం  చేసుకొని మండల కాంగ్రెస్ నాయకులు తమ పార్టీపై బురద జల్లుతున్నాడు అని  దళితులు చేసిన నిర్వాకాన్ని ఆసరా చేసుకొని  తేజ న్యూస్ పత్రిక పాత్రికేయుడు పై నీతిగా  కేసులు బనాయించారు, ఆ తదుపరి రోజు తేజ న్యూస్ పాత్రికేయుడకు డిస్కౌంట్ ఇచ్చినట్టుగా  తెల్లవారుజామున 20 మంది దళితులు  పాత్రికేయుడు ఇంటికి చేరుకొని  కాళ్ల బేరానికి వచ్చి  మేము చేసింది తప్పే కానీ మాకు వేరే దారి లేదు అంటూ ప్రాధేయపడడం కోసమెరుపు. ఐక్యత లేని వారి జీవనంలో ఇంకా ఎంతమంది పాత్రికేయులు బలైపోవాలి. అనే సందేహం  విద్యావేత్తలకు రాజకీయ ప్రముఖులకు సీనియర్ జర్నలిస్టులకు సైతం కనువిప్పు చేస్తోంది అని చెప్పొచ్చు. అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా నిలిచే పాత్రికేయులను  ఇలా అభాసపాలు చేస్తూ. నిజంగా అన్యాయం జరిగిన పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన పాత్రికేయులకు చంప పెట్టు అని  జరిగిన పరిణామం చెప్పకనే చెప్తుంది. యావత్ కుటుంబాన్ని పణంగా పెట్టి ప్రజల సమస్యల కోసం పోరాడే పాత్రికేయుడు పై  వెంకటాపురం మండల కేంద్రంలో దళితులు మాట మార్చిన తీరు పలువురిని ఆలోచించేలా చేస్తున్నాయీ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular