ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కంచికచర్ల పట్టణము శివాలయం,ఆలయములో ఈ రోజు సాయoత్రం దీపారాధ చేసిన….. నాయిని సతీష్,
దేవిరెడ్డి శీను,
తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డు తయారీలో వాడిన నెయ్యి అపవిత్రమునకు పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 30 న సాయంత్రం నందిగామ,నియోజకవర్గం, కంచికచర్ల పట్టణము, శివాలయం ఆలయములో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన నాయకులు, వీరమహిలలు, జనసైనికులతో కలిసి కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్ దీపారాధన చేశారు. ఈ సందర్భంగా నాయిని సతీష్ మాట్లాడుతూ తిరుమల YCP హయాములో నియమించిన టీటీడీ పాలకమండళ్లు తిరుమలలో చేసిన ఘోర అపచారాన్ని సనాతనధర్మాన్ని విశ్వసించే
ప్రతీ హిందువు ప్రశ్నించి ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో కూడా మౌనంగా ఉండటము సమాజానికి మంచిది కాదు అని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దీక్ష 9వ రోజుకు చేరుకోవడముతో రెండు తెలుగు రాష్ట్రాలో జనసేన తరుపున ప్రాయశ్చిత్త దీక్షను పల్లె పల్లెకు తీసుకువెళ్లే క్రమములో ఈ రోజు నుండి వరుసగా 4 రోజులపాటు కార్యక్రమాలు నిర్దేశించడము అయినది అని తెలిపారు. ఈ కార్యక్రమములో నియోజకవర్గ నాయకులు సుర సత్యనారాయణ, తోట ఓంకార్, కంభంపాటి రమాదేవి, పురుషోత్తం, కాలేశ్వరరావు, బ్రహ్మం, బాలాజీ, తిరుమలరావు, రోజా రమణి, మణికంఠ, తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కంచికచర్ల పట్టణములో దీపారాధ
RELATED ARTICLES