కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహా నైవేద్యం లడ్డు తయారీలో గత వైకాపా పాలనలో ఆవునెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుండి తీసిన నూనెలు కలిపి తయారీ గావించి స్వామి వారి ప్రసాదంగా కోట్ల మంది హిందువులకు సరఫరా చేసిన వైకాపా రాక్షస చర్యను ఎండగడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సిఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పల్లగిరి గట్టు మీద వేంచేసియున్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి స్వామి దేవాలయమునందు స్వామి వారికి దేవాలయ అర్చకులతో సంప్రోక్షణ మరియు ప్రాయశ్చిత్త పూజలను ప్రత్యేకంగా నిర్వహించి జరిగిన మహా అపచారమును మన్నించవలసిందిగా ప్రార్థించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ దైవాన్ని అపవిత్రం పాలుజేస్తూ ,కోట్ల మంది సనాతన ధర్మ భక్తుల, ప్రజల మనోభావాలతో, విశ్వాసాలతో నాటి వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడిందని దీని వెనుక పని చేసిన ప్రతి ఒక్కరినీ ఏమాత్రం అలసత్వం చేయకుండా శిక్షించాలి అని పార్టీ నాయకుడు పూజారి రాజేష్ ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో నందిగామ పట్టణ 20 వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకట కృష్ణ, సూరా సత్యనారాయణ, తెప్పలి కోటేశ్వర రావు, కొమ్మవరపు స్వామి, షేక్ రఫీ,కుటుంబరావు, సింగంసెట్టి శ్రీనివాస్,వెంకట తులసి,నరేంద్ర కుమార్, కూసునూరి నరసింహ, పోలిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
జనసేన పార్టీ
నందిగామ నియోజకవర్గం
పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నందిగామ జనసైనికుల పూజలు
RELATED ARTICLES