Wednesday, March 19, 2025

పల్నాడు జిల్లా: ముస్తాబు అవుతున్న ప్రభలు….గ్రామాల్లో ప్రభల సంబరం



పల్నాడు జిల్లా TEJA NEWS TV

చిలకలూరిపేట. / కోటప్పకొండ కొండ

భక్తులకు కోటయ్యస్వామి కొంగు బంగారం… మహాశివరాత్రి పర్వది నాన ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప
కొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరగ నుంది.

చేదుకో కోటయ్యా అంటూ ఒకరోజు ముందు నుంచి ప్రభల తరలింపు

ఒక్కో ప్రభ ఎత్తు 90 అడుగులు పైనే..గ్రామాల్లో కోలాహలం 


చేదుకో కోటయ్య.. చేదుకో అంటూ హరహర నామం ప్రతిధ్వనిస్తు  కోటప్పకొండకు ప్రభలు బయలుదేరనున్నాయి. మహాపర్వదినాన్ని పురస్క రించుకుని  భారీ విద్యుత్‌ ప్రభలు కొలువు దీరనున్నాయి. కొండపై కొలువున్న కోటయ్య స్వామి కిందకు దిగి రావాలంటే కోటిన్నొక్క ప్రభ నిర్మించాలని స్థల పురాణం చెపుతోంది. ఈ నమ్మకంతో భక్తులు ప్రభలను నిర్మిస్తూ కొండకు తరలిస్తున్నారు.


చిలకలూరిపేట,కోటప్ప కొండ : భక్తు లకు కోటయ్యస్వామి కొంగు బంగారం… మహాశివరాత్రి పర్వది నాన ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొం డ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరగ నుం ది. మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందు తున్న కోటప్పకొండ తిరునాళ్లలో భారీ విద్యుత్‌ ప్రభలు కొలువు దీరతాయి. తిరు నాళ్లకు పల్లెల్లో పోటాపోటీగా ప్రభలను నిర్మిస్తారు. ఒక్కో ప్రభ 90 అడుగులకు పైగా ఎత్తులో రూపుదిద్దుకుంటోంది. సం స్కృతి, సంప్రదా యాలకు ఈ ప్రభలు అద్దం పడతాయి.

నెల రోజుల ముందుగానే..

తిరునాళ్లకు నెలరోజుల ముందు నుంచే గ్రామాల్లో భారీ విద్యుత్‌ ప్రభల సందడి మొదలవు తుంది. ఊరంతా కలసి కట్టుగా ప్రభ పనుల్లో పాల్గొంటారు. ఈ ఏడా ది తిరునాళ్లకు భారీ విద్యుత్‌ ప్రభలు తరలి వస్తున్నాయి. ఒక్కో ప్రభ నిర్మాణ వ్యయం రూ.30 నుంచి రూ.35 లక్షల వరకు ఉంటుంది. గతంలో ఎడ్లతో ప్రభ ను తరలించేవారు. నేడు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రభ పగ్గాలు పట్టేందు కు వందలాది మంది పాల్గొంటారు. రథం ఇరుసు విరిగితే వెంటనే తయారు చేసేందుకు సంబంధిత పని వారు వెంట నడుస్తారు. రంగు రంగుల లైట్లు, వీటిని వెలిగించే విధానం చూపరులను కట్టి పడే స్తుంది. ప్రభల నిర్మాణంలో గ్రామాలకు గ్రామాలు పోటీ పడతాయి. ఈ ప్రభలలో పోస కూర్పు ప్రభలు, మండపాల ప్రభలు, టిక్కీల ప్రభలు, విద్యుత్‌ ప్రభలు, బాల ప్రభలు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి.  సాధారణ ప్రభలు అధిక సంఖ్యలో కొండకు తరలి వస్తాయి. ప్రభలపై తిరునాళ్లలో సంగీత విభావరి, నృత్యాలు నిర్వహిస్తారు. నరసరావు పేట మండలంలోని గురవాయపాలెం, ఉప్పల పాడు, కాకాని గ్రామాల నుంచి భారీ విద్యుత్‌ ప్రభలు కొండకు తరలివస్తున్నాయి.

ఈ ప్రభలదే ప్రత్యేకత..

చిలకలూరిపేట, కోటప్పకొండ తిరుణాళ్లలో చిలకలూరిపేట ప్రాంత ప్రభలకు ప్రత్యేకత ఉంది. కావూరు, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం, గోవిందాపురం, కమ్మవారిపాలెం, యడవల్లి, మద్దిరాల, బొప్పూడి, పురుషోత్తమపట్నం గ్రామాలలో రెండు రోజులముందే పూర్తిచేసి ప్రభలను ఠీవీగా నిలుపుతారు,
చేదుకో కోటయ్య అంటూ శివరాత్రి నాడు బయలుదేరనున్నాయి. పురుషోత్తమపట్నం నుంచి ఈ ఏడాది విడదల, తోట పుల్తప్పతాత, గ్రామ, మండలేనేని, బైరా, చిన్నతోట, యాదవరాజుల, తోట కృష్ణమ్మ ప్రభ ,
బ్రహ్మం గారి గుడి బజార్ , ప్రభలు కొండకు బయలుదేరేందుకు సిద్ధమయ్యాయి. క్రమం తప్పకుండా కోటప్పకొండకు ప్రభను నిర్మించే  కావూరు ప్రభ ప్రభ 78 వసంతాలను పూర్తిచేసుకుని కోలాహలంగా కొండకు బయలదేరందుకు సిద్ధమైంది. అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం, గోవిందాపురం, కమ్మవారిపాలెం, యడవల్లి, మద్దిరాల గ్రామాలలో  కనులపండువగా గ్రామ తిరుణాళ్ల పండుగను జరుపు కొనున్నారు. నాదెండ్ల మండలంలోని అవిశాయిపాలెం, అప్పాపురం గ్రామాలకు చెందిన భారీ విద్యుత్‌ ప్రభలను గ్రామస్తులు సిద్ధం చేశారు.
ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రభలను గ్రామస్తులు కొండకు ఊరేగింపుగా తరలించనున్నారు. అవిశాయిపాలెం ప్రభ ఈ ఏడాది 68వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular