సంగెం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన రాజాలు నిన్న గుండెపోటుతో అకాల మరణం చెందడం జరిగింది.విషయం తెలిసిన పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదివారం రాజాలు పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని అన్నారు.అదేవిధంగా ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు జీవన్ గౌడ్,వేల్పుల ప్రేమ్ సాగర్ లను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని ఎవ్వరూ ఆ దైర్య పడవద్దు అని అన్నారు ఈ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, సంగెం మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి, మాజీ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ నిమ్మగడ్డ, వెంకటేశ్వర్ రావు,సంగెం వ్యవసాయ శాఖ సంఘం సొసైటీ చైర్మన్ వేల్పుల, కుమారస్వామి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా
RELATED ARTICLES