కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ; ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖ ; సంగీత నాటక అకాడమీ వారు సంయుక్తంగా మొట్ట మొదటి సారిగా ఈరోజు దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో విదూషి విద్వన్మణి కుమారి దీపిక వరదరాజన్ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు
అహోబిలం లో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి గణ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అహోబిలం టూరిజం శాఖ వారు…
అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మేడం గారు
అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం అహోబిలంలో చాలా సంతోషకరమైన అన్నారు ఈ మెయిన్ ఈవెంట్ విజయవాడలో 6th నుండి 8th కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది…
స్టేట్ అండ్ సెంట్రల్ టూరిజం వారికి ధన్యవాదాలు గతంలో నేను టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు తెలిసింది సంస్కృతి భాష నాట్య కళలకు సంబంధించి ప్రజలకె కాకుండా భావితరాల వారికి ఎలా అందించాలన్న మెసేజ్ ఈ కళల ద్వారా తెలియజేయవచ్చు….
నాట్య కళలకు సంబంధించి నంద్యాల కర్నూలు జిల్లాల కు కర్నూల్ లోనే నాట్య మ్యూజికల్ అకాడమీ ఉంది నంద్యాల జిల్లా అయినా తర్వాత మనకు అకాడమీ లేదు కనుక సంబంధిత అధికారులతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి మ్యూజికల్ అకాడమీ వచ్చేలాగా కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…
అహోబిలంకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా నేను మంత్రిగా ఉన్నప్పుడు రోప్ వే మంజూరు చేయించడం జరిగింది గత ప్రభుత్వంలో ఆపివేశారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కనుక రోప్ వే పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు.
పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన సంగీత నీరాజనం
RELATED ARTICLES