రిపోర్టర్ పి శ్రీధర్
ఆళ్లగడ్డ సంత మార్కెట్ సమీపంలో ఒక 50 సంవత్సరాల అనాధ మహిళ శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. అందరూ చూడడం తప్ప ఎవరు ఆమె అంతిమ సంస్కారానికి ముందుకు రాకపోవడంతో ఆళ్లగడ్డ అమ్మ సేవా ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకుడు బిజ్జల నగేష్ ముందుకు వచ్చి అనాధ మహిళకు అన్ని తానే అయి స్మశానానికి తీసుకొని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి తమ మానవత్వం చాటుకున్నారు. ఇటీవలే తెలంగాణకు చెందిన ఒక సంస్థ వారు బిజ్జల నగేష్ కు చేస్తున్న సమాజ సేవను గుర్తించి గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా డా. నగేష్ ను అంతా అభినందిస్తున్నారు.
పరిమళించిన మానవత్వం..
అనాధ శవానికి అన్ని తానే అయి అంత్యక్రియలు..
RELATED ARTICLES