TEJA NEWS TV
_నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జండా దిమ్మెను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు. అనంతరం, నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు మరియు కూటమి నాయకులతో కలిసి జెండా ఎగురవేశారు._
_ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ నందిగామ మరియు జగ్గయ్యపేట నియోజకవర్గాలు ప్రజా రాజధాని అమరావతి దగ్గరలో ఉండటం శుభపరిణామమని, రెండు నియోజకవర్గాలలో గ్రామాల్లో వ్యవసాయంతో పాటుగా పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు. గతంలో రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి నుండి ఇవాళ ప్రజా రాజధాని అమరావతి అని చెప్పగలుగుతున్నాం అంటే అది కూటమి ప్రభుత్వ ఘనతే అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజా రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేయించడం తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు భవిష్యత్తులో మరెన్నో కేంద్ర , రాష్ట్ర పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన పార్టీ అధ్యక్షులు , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ గారి త్యాగం మరియు వ్యూహం ఎంతో ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో ఎంతో నిజాయితీతో ప్రభుత్వంలో పనిచేస్తున్నారని, అదే విధంగా కూటమి పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల పై దృష్టి నిలపాలని, రాబోవు ఎన్నికలలో మరల కూటమి పార్టీలు కలిసికట్టుగా విజయం సాధించాలని , దాని కోసం ప్రతి గ్రామంలో జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని జనసైనికులను కోరారు._
_కంచికచర్ల నుండి పరిటాల గ్రామం వరకు జనసైనికులు భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ గారు, కంచికచర్ల జనసేన పార్టీ అధ్యక్షులు నాయిని సతీష్ గారు, కంచికచర్ల తెలుగుదేశం మండల అధ్యక్షులు, AMC చైర్మన్ కోగంటి బాబు గారు, చలమల మధు, బొమిశెట్టి భాస్కరావు,దేవిరెడ్డి శ్రీనివాస్ గ్రామ జనసేన నాయకులు పురమా కాళేశ్వరం గారు, కొమ్మ నరేష్, పురమ వెంకట ప్రసాద్, బ్రహ్మం గారు, జగ్గయ్యపేట జనసేన నాయకులు షౌకత్ అలీ, తునికిపాటి శివ గారు తదితరులు పాల్గొన్నారు._
పరిటాల గ్రామంలో జనసేన జెండా దిమ్మెను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను
RELATED ARTICLES