*రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పాటు పాడుదాం*
*ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి*
సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.
ప్రపంచ స్థాయిలో భారతదేశం గుర్తింపు గౌరవం పొందడం వెనుక రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గాంధీజీల కృషి మరవకూడదని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమై పని చేయాలని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి కోరారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని అమరధామంలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు
అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ మాతృభూమి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులు త్యాగశీలులు అన్నారు, రాజ్యాంగ రూపకర్త ఆశయాలను నెరవేరుద్దాం మన దేశ ప్రజలంతా ఆనందంగా ఆత్మగౌరవంతో ఉండేందుకు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుదాం అన్నారు వివిధ మతాల, వర్గాల, కులాల వారు ఐక్యతతో గౌరవించేది మన రాజ్యాంగాన్ని అని రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తారని అన్నారు. భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు గౌరవం మన రాజ్యాంగానికి ఉందని అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గాంధీజీల కృషి మరవకూడదని వారి ఆశయాల సాధన కోసం పునరంకితమై ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కోరారు.
తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాడి బలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు మరువకూడదని వారి స్ఫూర్తితో వారి త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు.




