TEJA NEWS TV : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఘన నివాళులర్పించారు..*
*పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి..*
సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.
పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేసేందుకే పోచారం గుట్ట ప్రభుత్వ భూమిని సందర్శించడం జరుగిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలోని ప్రభుత్వ భూములను అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి తో పాటు రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు. పోచారం గుట్ట పైకి ఎక్కి చుట్టుపక్కల భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన పరకాల గ్రామస్థాయిలో అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, రైతులు పంటల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ముందు ఉన్నారని రెవెన్యూ కూడా జిఎస్టి అధికంగా ఇస్తున్నారని అభివృద్ధిలో మాత్రం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని అన్నారు.
ఎన్నికల సమయంలో పరకాలను విద్యా వైద్య ఉపాధి రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసి పరకాలకు గుర్తింపు తీసుకురావాలని ప్రజలు కోరడం జరిగిందని తాను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుండి ఆ దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు.
భూమి ఉంటే అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని భూమి లేకుంటే ప్రభుత్వ పథకాలు సంస్థలు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడం ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేసేందుకే పోచారం గుట్ట ప్రభుత్వ భూమిని సందర్శించడం జరుగిందని ఆయన అన్నారు.
రైతులు నిరుద్యోగ యువతకు ఆదాయం పెంపొందించే దిశలో ప్రయత్నమే పోచారం గుట్ట ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందని సర్వేనెంబర్ 625 ప్రభుత్వ గుట్టగా 235 ఎకరాలు ఉన్నదని అందులో 101 ఎకరాలు గుట్ట ప్రాంతం 88 ఎకరాలు భూమి అసైన్ భూమి అందులో 38 ఎకరాలు రైతులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని మిగతా 50 ఎకరాలు అసైన్ మిగిలి ఉందని అన్నారు.
రైతుల, నిరుద్యోగ యువత ను దృష్టిలో పెట్టుకొని రైతులకు న్యాయం చేస్తూనే ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యతగా తీసుకోవడం జరుగుతున్నదని అందుకు 100 ఎకరాలు ఉంటే ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తాయని తద్వారా రైతుల పత్తి చేసిన పంటలు గిట్టుబాటు ధరతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆ ప్రయత్నంలో భాగమే అడిషనల్ కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులతో సందర్శించడం జరుగుతున్నదని వారం రోజుల్లోగా గ్రౌండ్ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరడం జరిగిందని అన్నారు.
