వరంగల్ పార్లమెంట్ పరకాల నియోజకవర్గం కేంద్రంలో ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ*
తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం దళితులు, 95% ఓట్లు కాంగ్రెస్ పార్టీ కి వేశారు అన్నారు, దళిత, బిసి ,ఎస్టీ, మైనారిటీ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు అని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనీ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని, స్థానిక శాసన సభ్యుడు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేదలను ఆదుకునే నాయకుడు అని పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడే నాయకులను కాపాడుకునే నాయకులు అని రామకృష్ణ అన్నారు.
ఈ సమావేశంలో పరకాల మండల అధ్యక్షుడు చంద్రమౌళి , ఇనుగుల రమేష్ , మోహన్ , జిల్లా ఉపాధ్యక్షుడు నందిపక భాస్కర్ ,కార్యదర్శి మహేందర్ , జిల్లా నాయకులు జగన్ గౌడ్ , మహేష్ గౌడ్ , జిల్లా మరియు మైనారిటీ, బీసి, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.
పరకాల ఎస్సీ సెల్ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ
RELATED ARTICLES