TEJA NEWS TV
గత వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నెలకు 5000 రూపాయలతో పేద ప్రజలకు పనిచేసినటువంటి పదహారు వేలమంది గిరిజన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎన్.టి.ఎఫ్ కార్యాలయం నందు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు,జిల్లా ప్రధాన కార్యదర్శి గాలేటి వెంకటేశ్వర్లు,జిల్లా ఉపాధ్యక్షులు పోతూరాజు వెంకటేష్ లు మీడియా ద్వారా తెలిపారు.వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 16,000 మంది గిరిజన నిరుద్యోగులు ఇంటర్,డిగ్రీ చదివి ఐదువేల తక్కువ జీతం అయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేసి ప్రజలతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి గిరిజన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు ఎటువంటి జీవోలు లేవని చెప్పి వారిని పట్టించుకోకుందని ఎన్నికల ముందు వారి ప్రచారంలో వాలంటీర్లను ఆదుకుంటాం నెలకు పదివేలు జీతం ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని వారిని మోసం చేయడం అన్యాయంగా ఉందాని అన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టల్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వెంటనే ఆ పోస్టులను విడుదల చేసి గిరిజన యువతి యువకులు ఆదుకోవాలని ప్రైవేట్ సెక్టార్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ యువకులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు.
పదహారు వేల మంది గిరిజన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి… ఎన్ టి ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు
RELATED ARTICLES