సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామ ప్రజలకు ఎప్పటికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని తాజా మాజీ ఎంపిపి కందగట్ల కళావతి నరహరి అన్నారు.మంగళవారం రోజున మండలంలోని కుంటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు అందరూ కలిసి ఎంపీపీ కళావతి కీ ఆత్మీయ వేడుకొలు చేసి ఘన సన్మానం చేశారు.అనంతరం మాజీ ఎంపిపి కందగట్ల కళావతి మాట్లాడుతూ…ఐదేళ్లు ప్రజా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.ఈ ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామాలు మరియు మండల అభివృద్ధిలో భాగస్వాములం కావడం జీవితంలో నాకు మరిచిపోలేని సంతృప్తినిచ్చిందని అన్నారు.పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సేవలో ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో సంగెం మండల తహసీల్దార్ రాజు కుమార్,గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఏపీఎం.కిషన్,గ్రామ కార్యదర్శి మహ్మద్ వాజీద్,మాజీ సర్పంచులు కావటి వెంకటయ్య యాదవ్,ఎలుగోయ లింగయ్య,రౌతు నాగయ్య,మాజీ ఉపసర్పంచ్ దుడయ్య యాదవ్,మాజీ ఎంపిటీసీ కాగితాల జగన్నాథచారి,సొసైటీ డైరెక్టర్ గొపతి రాజు కుమార్ యాదవ్,నాయకులు బుసానీ మొగిలి,దానం స్వామి,జున్న దేవేందర్ యాదవ్,గుండాల మొగిలి,రౌతు నర్సయ్య,రౌతు రమేష్,చిర్ర మొగిలి,చిర్ర ఆనంద్,చిర్ర సునీల్,వార్డు సభ్యులు,గ్రామ వివో అధ్యక్షురాళ్లు సీసీ లు కృష్ణమూర్తి,కుమారస్వామి,సిఎ లు సువర్ణ,మాధవి,మహిళలు గ్రామస్తులు తదితరులు పోల్గొన్నారు.
పదవి ఉన్న లేకున్నా ప్రజా సేవలోనే ఉంటాం.. -సంగెం మాజీ ఎంపిపి కందగట్ల కళావతి-నరహరి
RELATED ARTICLES